Talasani Srinivas: నంది అవార్డులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నంది అవార్డుల విషయంలో.. వివాదం నడుస్తోంది. తాజాగా ఈ అవార్డులపై మంత్రి తలసాని స్పందించారు. ఈ విషయంపై ఇప్పటివరకు ఎవరూ తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని చెప్పుకొచ్చారు.
మంత్రి ఏమన్నారంటే? (Talasani Srinivas)
నంది అవార్డులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నంది అవార్డుల విషయంలో.. వివాదం నడుస్తోంది. తాజాగా ఈ అవార్డులపై మంత్రి తలసాని స్పందించారు. ఈ విషయంపై ఇప్పటివరకు ఎవరూ తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని చెప్పుకొచ్చారు. నంది అవార్డుల విషయంలో.. పోసాని కృష్ణమురళి, అశ్వినీదత్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ వివాదం విషయంలో ప్రభుత్వాన్ని ఎవరూ స్పందించలేదని తలసాని అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇచ్చేలా ఆలోచిస్తామని అన్నారు.
ఎవరు పడితే వాళ్లు అడిగితే ఇవ్వరు..
ఉమ్మడి ఏపీలో ప్రతి ఏటా ఈ అవార్డులను అందించేవారు. చివరిసారిగా 2016లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
2016 నుంచి అవార్డులు ప్రకటించకపోవడంతో.. చాలా మంది సినీనటులు స్పందించారు.
కానీ అటు ఏపీ ప్రభుత్వం.. ఇటు తెలంగాణ ప్రభుత్వాలతో సినీ ప్రముఖులు ఈ ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో రెండు రాష్ట్రాల నుంచి అవార్డుల పంపిణీ జరగలేదు.
నంది అవార్డుల విషయంలో ఇటీవలే కొందరు నిర్మాతలు స్పందించారు. నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి రెండు ప్రభుత్వాలకు లేదన్నారు.
ప్రభుత్వ అవార్డుకు ఒకప్పుడు విలువ ఉండేదని, ఇప్పుడు ఆ విలువ లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. పురస్కారాలలోనూ రాజకీయ జోక్యం ఎక్కువైందని విమర్శించారు.
అశ్వినీదత్ కొంచెం ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం అంతా ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ లాంటి పురస్కారాలు ఇస్తారు అని, సినిమాలకు అవార్డులు ఇచ్చే రోజులు లేవు అన్నారు.
దీనిపై పోసాని కృష్ణమురళి ఘాటుగా రిప్లే ఇచ్చారు.