Site icon Prime9

Maoist leader Savitri: మావోయిస్టు రామన్న సతీమణి సావిత్రి లొంగుబాటు

MAOIST

Hyderabad: మావోయిస్టు దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ రామన్న భార్య సావిత్రి పోలీసుల ముందు లొంగిపోయింది. ప్రస్తుతం సావిత్రి కిష్టాపురం ఏరియా కమిటీ సెక్రటరీగా ఉంది. వరంగల్ జిల్లాకు చెందిన రామన్న 2019లో గుండెపోటుతో చత్తీస్ ఘడ్ అడవుల్లో చనిపోయాడు. రామన్న మరణం తర్వాత గతేడాది సావిత్రి కుమారుడు రంజిత్ లొంగిపోయాడు. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్,జార్ఖండ్, తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా రామన్న ఉన్నాడు. 1994లో దళం సభ్యురాలు సావిత్రిని రామన్న పెళ్లి చేసుకున్నాడు. రామన్న పై గతంలో రూ. 40లక్షల రివార్డ్ ఉంది.

ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రి 13 ఏళ్ల వయసులోనే మావోయిస్టులోకి వెళ్ళింది. 30 ఏళ్ల ప్రస్థానంలో 350 మంది యువతను మావోయిస్టు వైపు మళ్లించింది. పార్టీకి సమాచారం ఇవ్వకుండానే లొంగి పోయింది. సావిత్రిలాగే చాలా మంది మావోయిస్టు పార్టీ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారు. కానీ జనజీవన స్రవంతిలో కలవకుండా మావోయిస్టు పార్టీ అడ్డుకుంటోంది’ అని అన్నారు.

ఛత్తీస్ ఘడ్ లో ప్రజలు మావోల వైపు లేరని సావిత్రి చెప్పారు. మావోయిస్టు పార్టీలోకి బలవంతంగా చేరుస్తున్నారు తప్ప, ఎవరు కూడా స్వయంగా మావోల వైపు రావడం లేదు. స్కూల్స్ , సదుపాయాలు ప్రభుత్వమే కల్పించడంతో ఎవరు కూడా మావోయిస్టు వైపు రావడం లేదు. మావోయిస్టులు లొంగిపోతే వారికి కావాల్సిన వసతులు, రివార్డు, ప్రభుత్వం నుండి రావాల్సిన బేఫిట్స్ అన్ని ఇచ్చేలా చూస్తాం. జనజీవన స్రవంతిలో కలిసి పోయేలా మేము చేస్తామని హామీ ఇస్తున్నామని పేర్కోన్నారు.

Exit mobile version
Skip to toolbar