Prime9

TG : పోలీసు సేవా పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. 11 మందికి శౌర్య పతకం

Telangana Govt : తెలంగాణ సర్కారు పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సేవా పతకాలను ప్రకటిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో పనిచేసే గ్రేహౌండ్స్‌కు చెందిన 9 మందికి శౌర్య పతకం దక్కింది. 16 మంది మహోన్నత సేవా పతకం, 92 మంది ఉత్తమ సేవా పతకం, 47 మంది కఠిన సేవా పతకం, 461 మంది సేవా పతకం అందుకోనున్నారు.

 

అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవా, 4గురికి ఉన్నత సేవా, 17 మందికి సేవా పతకాలు వరించాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలో ఒకరికి ఉత్తమ సేవా, 5గురికి సేవా పతకాలు వచ్చాయి. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ శాఖలో ఇద్దరికి శౌర్య పతకం, ఒకరికి మహోన్నత పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా, 14 మందికి సేవా పతకాలు దక్కాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఒకరికి మహోన్నత సేవా, ముగ్గురికి ఉత్తమ సేవా, 15 మందికి సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.

Exit mobile version
Skip to toolbar