Site icon Prime9

Tammineni krishnaiah murder case: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్

Khammam: ఖమ్మంలో సంచలనం సృష్టించిన టిఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను ఏపీలో అరెస్ట్ చేశారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటుగా, పోలీసులు ఎనిమిది మందిని ఈ కేసుల నిందితులుగా చేర్చారు. వారిమీద 148, 341, 132, 302, 149 సెక్షన్ క్రింద కసులు నమోదు చేశారు.

కాగా A1 తమ్మినేని కోటేశ్వరరావు, A3 కృష్ణ మినహా మిగిలిన వారందరిని పోలీసులు అరెస్టు చేసారు. A2గా ఉన్న రంజాన్, A4 గజ్జి కృష్ణ స్వామి, A5 నూకల లింగయ్య, A6 బోడపట్ల శ్రీను, A7 నాగేశ్వరరావు A8 ఎల్లంపల్లి నాగయ్యను పోలీసులు అరెస్టు చేశారు.

Exit mobile version