Site icon Prime9

MLA Rajaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. మహిళా కమిషన్ నోటీసులు

mla rajaiah

mla rajaiah

MLA Rajaiah:స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మరో షాక్ తగిలింది. ఇది వరకే ఓ మహిళ సర్పంచ్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళ సర్పంచ్ వ్యాఖ్యల ఆధారంగా సుమోటాగా కేసును పరిగణలోకి తీసుకుంది.

రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. (MLA Rajaiah)

ఎమ్మెల్యే రాజయ్యపై మహిళ సర్పంచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఈ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసి కోరిక తీర్చాలని వేధిస్తున్నారని ఆరోపించారు. లైంగికంగా వేధించినట్లు మీడియా ముఖంగా పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంపై పూర్తి వివరణ ఇవ్వాలని డీజీపీకి లేఖ రాశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేపై చర్యలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఎవరి ప్రమేయం లేదు..

సంచలన ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య. తన వెనక ఎవరు లేరని స్పష్టం చేశారు. వేధింపులు భరించలేకనే ఇలా మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం లేదన్నారు. నీ మీద కోరికతోనే పార్టీ టికెట్‌ ఇచ్చానని ఎమ్మెల్యే పలు సందర్భాల్లో అన్నారని నవ్య ఆరోపించారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారని.. హగ్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తారని మండిపడ్డారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.

స్పందించిన ఎమ్మెల్యే..

ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని అందుకే గతంలో జరిగిన విధంగా తనపై కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషించి తనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. సర్పంచ్ ఆరోపణలు నిజమైతే ఆయనపై చర్యలు తప్పవు.

Exit mobile version