Site icon Prime9

Sabita Indrareddy: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ.. స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

sabita

sabita

Sabita Indrareddy: పదో తరగతి పరీక్ష పత్రాలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్ధులను గందరగోళానికి గురి చేయవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు.. మరోసారి జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

స్పందించిన మంత్రి సబిత.. (Sabita Indrareddy)

పదో తరగతి పరీక్ష పత్రాలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్ధులను గందరగోళానికి గురి చేయవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు.. మరోసారి జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. పదో తరగతి పరీక్షల్లో వరుసగా రెండురోజులు పేపర్లు బయటకు వచ్చాయి. ఈ మేరకు పరీక్షల నిర్వహణ విషయంలో అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.

పేపర్ లీకేజీపై మంత్రి సీరియస్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పలు సూచనలు చేశారు. పరీక్షల విషయంలో.. జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు, పోలీసు విభాగం, పోస్టల్‌ శాఖ, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. ప్రతి ఒక్కరు బాధ్యతగా పని చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 4.95 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమయంలో విద్యార్ధులను ఇబ్బందులకు గురిచేయాలని చూసిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
రాజకీయ కక్షలో భాగంగా విద్యార్ధుల జీవితాలను నాశనం చేయవద్దని సూచించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

పదో తరగతి పరీక్ష పత్రాలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది.

తొలి రోజు తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ లో చక్కర్లు కొట్టగా.. తాజాగా రెండో రోజు హిందీ పేపర్ వాట్సాప్ లో వైరల్ అయింది.

ఇప్పటికే టీఎస్ పీఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

వాట్సాప్ లో హిందీ పేపర్..

పదో తరగతి పరీక్ష పత్రాలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది.

తొలి రోజు తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ లో చక్కర్లు కొట్టగా.. తాజాగా రెండో రోజు హిందీ పేపర్ వాట్సాప్ లో వైరల్ అయింది.

ఇప్పటికే టీఎస్ పీఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

తాజాగా పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. రెండో రోజు హిందీ పేపర్.. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే వాట్సాప్ లో వైరల్ అయింది.

ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించలేదు.

ఈ ప్రశ్నపత్రం బయటకు ఎలా వెళ్లిందనే విషయంపై అధికారులు విచారణ ప్రారంభించారు.

వరుసగా రెండో రోజు లీక్ అవ్వడం పట్ల.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు.

ఈ లీక్ అవ్వడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు వరంగల్‌, హన్మకొండ డీఈవోలతో మంత్రి మట్లాడారు. ఈ ఘటనపై వెంటనే సీపీకి ఫిర్యాదు చేయాలని అధికారులకు సూచించారు.

మంత్రి సూచనతో.. డీఈవోలు సీపీ కి ఫిర్యాదు చేశారు.

Exit mobile version