Site icon Prime9

My Home bhooja Ganesh laddu: బాలాపూర్ లడ్డు ధరను బ్రేక్ చేసిన మై హోమ్‌ భుజా లడ్డు

laddu-auction-at-my-home-bhooja-apartments

Hyderabad: గణేష్ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు చాల మహిమగలదని భక్తుల విశ్వాసం. అందుకే ఈ లడ్డు ను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు. లక్షలు పెట్టి మరి వేలంపాటలో లడ్డును దక్కించుకుంటారు. అయితే గణేష్ లడ్డు వేలంపాట అంటే అందరికి బాలాపూర్ లడ్డునే గుర్తు వస్తుంది. ప్రతీ ఏడాది ఇక్కడ లడ్డు ధర పెరుగుతుంటుంది. ఇక ఈసారి ఎంత పలుకుతుందనేది చూడాలి.

ఇదిలా ఉంటె తాజాగా మాదాపూర్​ మై హోమ్​ భుజా అపార్ట్​మెంట్​ గణేశ్ మండపంలో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా బాలాపూర్​ లడ్డూ గత రికార్డునే బ్రేక్ చేసింది. ఎవరూ ఊహించని రీతిలో రూ.20.50 లక్షలకు మైహోమ్‌ భుజాలో ఉంటున్న సత్తిబాబు అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు.

గతకొద్ది సంవత్సరాలుగా లడ్డూ వేలంలో బాలాపూర్ లడ్డు ధర పెరుగుతూనే ఉంది. అయితే తాజాగా మైహోమ్‌ భుజా లడ్డు ధర ఎక్కువగా పలకడంతో ప్రస్తుతం అందరి దృష్టి రేపు జరగనున్న బాలాపూర్​ లడ్డూ వేలంపాట పై పడింది. అయితే ఈ ధరను బాలాపూర్​ లడ్డూ బ్రేక్​ చేస్తుందో లేదో చూడాలి మరి.

 

Exit mobile version