Site icon Prime9

TS Rains: వాతావరణశాఖ హెచ్చరిక.. పలు జిల్లాల్లో వడగండ్ల వర్షాలు

Rain threat for Telangana

Rain threat for Telangana

TS Rains: తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ చత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వడగండ్ల వర్షం ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

వడగండ్ల వాన..

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ చత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వడగండ్ల వర్షం ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

ఉపరిత ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో పాటు.. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదవుతాయని సూచించింది. ఆదివారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 39.3 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. కనిష్టంగా మహబూబ్‌నగర్‌లో 21.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.

14 జిల్లాల్లో వడగళ్ల వర్షం..

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వర్ష ప్రభావంతో.. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ, ములుగు, హనుమకొండ, భూపాలపల్లి, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. అలాగే పలు చోట్ల.. స్తంభాలు విరిగిపడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలు మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది.

వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ లో 8.4 సెం.మీటర్ల వర్షం కురిసింది. చెన్నారావుపేటలో 5.9 సెం.మీటర్లు, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో 4.8, హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో 4.1, మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో 3.2, కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో 3.2, ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌లో 2.6 సెం.మీటర్ల వర్షపాతం నమోదయింది.

Exit mobile version