Prime9

Rain Alert: వాతావరణశాఖ అలర్ట్.. వచ్చే మూడురోజులు వానలు

Telangana: తెలంగాణలో రానున్న మూడురోజుల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుందని హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడె, నల్గొండ, జనగాం, సూర్యాపేట, ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ లోనూ రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

మరోవైపు రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండవేడికి తాళలేక ప్రజలు శీతల పానీయాలు సేవిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యాంగా చిన్నపిల్లలు, వృద్దులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

కాగా రాబోయే మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. మరోవైపు నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Exit mobile version
Skip to toolbar