Prime9

Fire Accident In Charminar: అగ్నిప్రమాదం తీవ్ర ఆవేదనకు గురిచేసింది: పవన్ కళ్యాణ్

BreakingNews: Pawankalyan On  Fire Accident:  గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై తీవ్ర ఆవేదనకు గురయ్యానన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని పవన్‌ అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి : సీఎం చంద్రబాబు
గుల్జార్ హౌస్‌లో జరిగిన విషాదకర అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. అగ్నిప్రమాదంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన ఎక్స్‌లో తెలిపారు.


మోదీ దిగ్భాంతి, 2 లక్షల రూపాయల పరిహారం
అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డవారికి 50వేల రూపాయల పరిహారాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.

Exit mobile version
Skip to toolbar