Site icon Prime9

Niranjan Reddy: ధాన్యం ఎలా ఉన్నా కొంటాం.. జిల్లా కలెక్టర్లకు మంత్రి కీలక ఆదేశాలు

niranjan reddy

niranjan reddy

Niranjan Reddy: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి జిల్లాలో వర్షాలకు.. ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం ఎలా ఉన్న కొనాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం ఎలా ఉన్న కొంటాం.. (Niranjan Reddy)

అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి జిల్లాలో వర్షాలకు.. ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం ఎలా ఉన్న కొనాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం ఎలా ఉన్న ప్రతి గింజను కొనాల్సిందేనని.. సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని.. జిల్లా కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతులు ఎవరు దిగులు చెందవద్దని మంత్రి అన్నారు. ప్రతి గింజను కొనే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరవై ఎళ్ల పాలనలో ఎన్ని ప్రభుత్వ గోదాములో నిర్మించారో..

అంతకు మించి తొమ్మిదెళ్లలో ఎక్కువ గోదాములు నిర్మించాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వమే.. చేతులెత్తేసింది. ఎఫ్ సిఐ తరపున ఒక్క గోడౌన్ కూడా నిర్మించలేదన్నారు.

రైతు బంధు పథకం వల్లే తెలంగాణలోని ప్రతి బీడు భూమిలో పంటలు పండుతున్నాయన్నారు. భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా భూములకు ధరలు పెరిగాయని మంత్రి అన్నారు. ఎకరాకు 20 లక్షల మించి ధరలు పలుకుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

ఐక్యరాజ్య సమితి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు, రైతు బీమాను బెస్ట్ స్కీమ్స్ అని అభినందించిందని తెలిపారు.

కానీ దేశ ప్రధానికి, బీజేపీ నేతలకు మాత్రం కనిపించడం లేదన్నారు.

తెలంగాణలో జరిగిన పంట నష్టంపై కేంద్రానికి ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల పరిస్థితి చూస్తే దుఃఖం వచ్చిందని, కానీ కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. ఎలాంటి దాన్యం అయిన కొనాల్సిందే అని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు.

ప్రతీ ధాన్యపు గింజ కొనాల్సిందే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.

 

Exit mobile version