Site icon Prime9

Traffic Rules : హైదరాబాద్ నగరంలో 11 రోజల పాటు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..?

new Traffic Rules in hyderabad city for vinayakachavithi festival

new Traffic Rules in hyderabad city for vinayakachavithi festival

Traffic Rules : ప్రజలందరికీ ముందుగా “వినాయక చవితి” శుభాకాంక్షలు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా వినాయక చతుర్ధి వేడుకలు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అయితే సిటీ వ్యాప్తంగా నేటి నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న తరుణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. నగరంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ప్రసిద్ధి.

ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది భక్తులతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రలు వస్తుంటారు. అందుకే నగరంలో భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. గణేషుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నగర వ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఖైరతాబాద్ పరిసరాల్లో రానున్న 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు నేటి నుంచి అంటే సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.

11 రోజుల పాటు ఏ ఏ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయంటే..?

Exit mobile version