Munnuru Kapu Sangham : హఫీజ్ పేట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు పోగుల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొనగా.. కార్పొరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య కూడా హాజరయ్యారు. వేద పండితుల ఆశీర్వాదాలతో శాస్త్ర యుక్తంగా నిర్వహించిన భూమి పూజలో పలువురు ప్రముఖులు, మున్నూరు సంఘం నేతలు, సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ.. హఫీజ్ పేట మున్నూరు కాపు సంఘం దినదిన అభివృద్ధి చెందడం ఎంతో ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్రం మొత్తం హఫీజ్ పేట మున్నూరు కాపు సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రమంతటా మున్నూరు కాపు సంఘం భవనాలను ఏర్పాటు చేయాలని కోరారు.