MP Komati Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన ఓ ఆడియో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వైరల్ అవుతోంది. ఈ సంభాషణలో కోమటిరెడ్డి కాంగ్రెస్ నేతలు హత్య చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఆడియో వైరల్.. అందులో ఏముందంటే? (MP Komati Reddy)
నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఉన్న ఇమేజ్ వేరు. వీరు ఏ పని చేసిన వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం కోమటిరెడ్డికి సంబంధించిన ఓ ఆడియో నెట్టింటా వైరల్ గా మారింది. దీంతో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇందులో అదే కాంగ్రెస్ కు చెందిన నేత గురించి.. ఆయన హత్య ఆరోపణలు చేశారు. బూతు మాటలతో రెచ్చిపోయిన కోమటిరెడ్డి.. తన అనుచరులు తలచుకుంటే ఏదైనా చేస్తారని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం తెలంగాణలో చర్చనీయంశంగా మారింది. ఇంకా ఈ ఆడియోపై కోమటిరెడ్డి స్పందించాల్సి ఉంది. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ తనయుడితో సంభాషించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆయన కోమటిరెడ్డిపై ఫిర్యాదు చేశారు.
తనను, తన తండ్రి చెరుకు సుధాకర్‌ను హత్య చేస్తానని బెదిరించారని కాంగ్రెస్ నేత కుమారుడు సుహాస్ నల్లగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం తనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి.. నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీ నాన్నని చంపడానికి 100 వాహనాల్లో నా మనుషులు తిరుగుతున్నారు. ఇలాగే వ్యవహరిస్తే నీ నవ్య హాస్పిటల్ కూడా కూల్చేస్తారు. నిన్ను కూడా చంపుతానని బెదిరించారని సుహాస్ ఆరోపించారు. తాను లక్షల మందికి సాయం చేశానని.. వారే మిమ్మల్ని హత్య చేయడానికి తిరుగుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సుహాల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ వర్గాల్లో చీలిక..
కోమటిరెడ్డికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కాల్ రికార్డింగ్‌లో పలు బూతులు మాట్లాడినట్లు తెలుస్తోంది. చాలా సార్లు నా గురించి బయట చెడ్డగా చెబుతున్నారు. మా అనుచరులు నెల రోజుల నుంచి ఓపిక పట్టి.. ఇప్పుడు వంద వెహికిల్స్‌లో తిరుగుతున్నారు. నీ హస్పిటల్ ఉండదు. నేను లక్షల మందిని బతికించినా. ఎంత ధైర్యం వానికి.. నిన్న మొన్న పార్టీలోకి వచ్చి.. ఇప్పుడు నా మీదనే మాట్లాడుతుండు. ఇక వదిలిపెట్టరు నా మనుషులు వాన్ని. వార్నింగ్ ఇస్తున్నా.. వారం రోజుల్లో వాన్ని చంపేస్తారు. వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తారు అని ఉంది.
ఇటీవల ఖమ్మం పర్యటనలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయంటూ చెరుకు సుధాకర్ మాట్లాడటం జరిగింది. అదే సమయంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరికను కోమటిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఈ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. ఈ వార్నింగ్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు చెరుకు సుధాకర్ గతేడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ఇప్పుడు ఆయనను హత్య చేసేందుకు తన అనుచరులు వంత వాహనాల్లో తిరుగుతున్నారు అంటూ కోమటిరెడ్డి చేసిన బెదిరింపులు కాంగ్రెస్ వర్గాల్లో సంచలనంగా మారాయి.