Site icon Prime9

MLC Jeevan Reddy: సీఎం కేసీఆర్‌కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ.. ఏమన్నారో తెలుసా?

mlc jeevan reddy

mlc jeevan reddy

MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు జూనియర్ పంచాయతీ సెక్రెటరీలను రెగ్యూలర్ చేయాలని అందులో పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. వారిని వెంటనే రెగ్యూలర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బహిరంగ లేఖ.. (MLC Jeevan Reddy)

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు జూనియర్ పంచాయతీ సెక్రెటరీలను రెగ్యూలర్ చేయాలని అందులో పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. వారిని వెంటనే రెగ్యూలర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శలను రెగ్యులర్ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. నిబంధనల ప్రకారమే వారి నియామకం జరిగిందని ఆయన అన్నారు. జేపీఎస్ ఉద్యోగులతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని.. ఇచ్చిన మాట ప్రకారం వారిని రెగ్యూలర్ చేయాలని లేఖలో పేర్కొన్నారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. విధులు నిర్వర్తించిన వారిని రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వమే హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా.. వారి జీవితాలతో ఆటలాడుతుందని ఆరోపించారు. రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే పంచాయతీ సెక్రెటరీలు సమ్మెకు దిగారని జీవర్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు వాళ్లను రెగ్యులర్ చేయాలని కోరారు.

కాగా.. తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏప్రిల్‌ 29 నుంచి నిరవదిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమను క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి సమ్మెపై ప్రభుత్వం ఆగ్రహ్యం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులు కూడా పంపింది.

మంగళవారం సాయంత్రం 5:00 గంటల్లోగా సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. విధుల్లో చేరిన తర్వాత రెగ్యులర్ చేసే విషయంపై చర్చలు జరుపుతామని హామీ ఇచ్చింది.

Exit mobile version