Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరిన ఆయన్ను ముందస్తు చర్యల్లో భాగంగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరిన ఆయన్ను ముందస్తు చర్యల్లో భాగంగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా.. ముందస్తు చర్యల్లో భాగంగానే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేయడంపై రాజాసింగ్ స్పందించారు. పోలీసులు ఏ కారణంతో అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి హనుమాన్ జయంతి సందర్భంగా.. తాను బైక్ ర్యాలీలో పాల్గొంటానని ఈ సారి మాత్రం పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపారు. తన అరెస్ట్ తర్వాత జరిగే.. విధ్వంసాలు, అనర్థాలకు తాను మాత్రం బాధ్యుడిని కాదని కామెంట్స్ చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గౌలిగూడ టు తాడ్‌బండ్ హనుమాన్ జయంతి విజయ యాత్రకు బందోబస్తు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ట్రాఫిక్ మళ్లీంపుకు చర్యలు తీసుకున్నట్లు ట్రాఫిక్ అడిషినల్ సీపీ జి.సుధీర్‌బాబు తెలిపారు.
రాత్రి 7 గంటల దాకా యాత్ర ఉండటంతో.. వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ వెళ్లేవారి కోసం రూట్ మ్యాప్ సూచించినట్లు తెలిపారు.