Site icon Prime9

Missing Cases : పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు… హైదరాబాద్ లో రోజుకి 30 మంది… వైఫల్యం ఎవరిది?

details about girls missing in chittor and palnadu district

details about girls missing in chittor and palnadu district

Missing Cases : తెలంగాణ రాష్ట్రంలో మిస్సింగ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా వారిలో చిన్నారుల వరుస మిస్సింగ్‌ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనలతో నగరంలో భయానక వాతావరణం నెలకొంటుంది. ఇటీవల దమ్మాయిగూడలో కనిపించకుండా పోయిన చిన్నారి ఇందు చెరువులో విగతజీవిగా కనిపించింది. ఆ తర్వాత వరుసగా పాతబస్తీ లో నసీర్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత కవాడిగూడకు చెందిన 13 ఏళ్ల బాలిక అదృశ్యమయ్యింది. వీరిద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు తప్పిపోతున్న వారిలో కొందరు ఆచూకీ లభ్యమైనప్పటికీ మరికొందరు జాడ అస్సలు తెలియడం లేదు.

ఇటీవల తప్పిపోయిన వారిలో మహిళలే అధికంగా ఉండడం వారిని హ్యూమన్ ట్రాఫిక్ ద్వారా అక్రమ రవాణా చేయడం జరుగుతుందని సమాచారం అందుతుంది. హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో అధిక శాతం మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత ఏడాది చూస్తే ఈ ఏడాది ఈ సంఖ్య తగ్గేదే అన్నట్టుగా పెరుగుకుంటూ పోతూనే ఉంది. ప్రతి ఏటా నమోదయ్యే కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు ఆచూకీ లభ్యమవుతుంది మిగతా 15% కేసులు మిస్టరీగా ఉన్నాయి. ఇలాంటి కేసులను సిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.

మిస్సింగ్ కేసులను చేదించడం పోలీసులకు సవాలుగా మారుతోంది. కొన్ని కేసులను టెక్నాలజీ ఆధారంగా సులభంగా చేదిస్తున్నారు. మహిళలు మిస్సింగ్ కేసులో అధిక శాతం ప్రేమ వ్యవహారం అని ప్రాథమిక నిర్ధారణలో తేలింది. మిస్సింగ్ కి సంబందించి వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం ఆపై వారి గురించి దర్యాప్తు కొనసాగిస్తే 75 శాతం మంది ప్రేమ పేరుతో వెళ్లిపోవడం జరుగుతోందని తేలింది. ఇంకో యాంగిల్ లో అక్రమ సంబంధాలు ఎక్కువ ఉన్నాయని ప్రియుడి కోసం భర్త ను చంపేయడం లేదా ప్రియురాలు కోసం భార్యని చంపే నేపథ్యమే ఎక్కువ ఉందని మరికొన్ని ఆస్తి కోసం జరిగిన వాటిగా నిర్దారించారు.

2022లో ఇప్పటి వరకు రాచకొండ కమిషరేట్ పరిధిలో 3,338, సైబరాబాద్ పరిధిలో 3,798 మిస్సింగ్ కేసులు నమోదవగా… హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 3వేల మంది వరకు మిస్ అయ్యారు. అంటే ఒకే ఏడాదిలో 10వేల మందికి పైగా మిస్ అవగా నగరంలో సగటున రోజుకు 30మంది మిస్ అవుతున్నారని తెలుస్తుంది. ఇందులో 16 నుంచి 35 ఏళ్ల మధ్య వారే అధికంగా ఉండగా వీటిల్లోనూ బాలికలు, యువతుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పలువురు పోలీసుల వైఫల్యం చెందుతున్నారా ? లేదా కారణం ఏంటి అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాలను అయిన పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

Exit mobile version