Sangareddy: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో దారుణం చోటు చేసుకుంది. మైనార్డీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుతున్న ఓ ఇంటర్ బాలిక ప్రసవించింది. మైనర్ బాలిక ప్రసవించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మైనర్ బాలిక ప్రసవం.. (Sangareddy)
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో దారుణం చోటు చేసుకుంది. మైనార్డీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుతున్న ఓ ఇంటర్ బాలిక ప్రసవించింది. మైనర్ బాలిక ప్రసవించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఎలా గర్భవతి అయింది. ఈ విషయం ఎందుకు బయటకు రాలేదనే కోణంలో విచారణ జరుగుతుంది.
నారాయణఖేడ్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఓ బాలిక ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతోంది. గత నెల చివరి వారంలో ఆ బాలిక పాఠశాల బాత్ రూమ్ లో ప్రసవించింది.
వెంటనే బాలిక తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ సమాచారం అందించారు. మీ కూతురు ప్రసవించిందని.. వచ్చి తీసుకెళ్లాలని తెలిపాడు.
ఈ వార్త విని బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. స్కూల్ కి చేరుకొని.. దీనికి కారణం ఏంటని వారు ప్రశ్నించారు.
అయితే దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించలేదు.
అభం శుభం తెలియని బాలికపై.. కామ కోరికలు తీర్చుకుంటారా అని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయం బయట ఎక్కడా చెప్పకూడదని బాలిక తల్లిదండ్రులకు చెప్పారు.
ఈ విషయం బయటకి తెలిస్తే.. తమ పరువు పోతుందని భావించారు. దీంతో పసికందును ముళ్లపొదల్లో పారేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పసిపాప ఏడుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పసిపాపను ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త బయటకు రావడంతో.. అధికారులు సీరియస్ అయ్యారు.
ప్రిన్సిపల్ మంజుల, డిప్యూటీ వార్డెన్ నసీమ్ బేగం, స్టాఫ్ నర్స్ సంధ్య లను సెక్రటరీ సస్పెండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.