Uttam Kumar Reddy in Telangana SLBC tunnel: దేశంలోనీ నిష్ణాతుల సహ కారంతో రెండు మూడు రోజులలో సహాయక చర్యలు పూర్తి చేయనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరో మూడు నెలలలో తిరిగి సోరంగ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఎస్ఎల్బీసీ క్యాంప్ కార్యాలయం దగ్గర మంత్రి అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావుతో కలిసి గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా కటింగ్ బృందం ఈ సహాయక చర్యలలో పాల్గొంటున్నదని వెల్లడించారు. సహాయక చర్యలు వేగవంతం అయ్యాయన్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.
టన్నెల్ లో ఉన్న నీటిని భారీ పంపులతో బయటికి పంపి, బురదను తీసివేసి టీబీఎం ముందు భాగానికి చేరుకోనున్నామని తెలిపారు. టీబీఎం చివరి భాగాలను కట్టర్లతో తొలగించనున్నామని వివరించారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, రాబి న్సన్ మైనింగ్ ప్రతినిధులు, మెగా, నవయుగ, కంపెనీల బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతు న్నాయన్నారు. టీబిఎం శిథిలాలను, బురదను సొరంగంలో ప్రమాద స్థలం నుండి బయటికి తెస్తామని తెలిపారు. ప్రమాదం జరిగినప్పటి నుండి రాష్ట్రమంత్రులం నిరంతరం సహాయక చర్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నా యి. సొరంగంలో చిక్కుకున్న వారి జాడ గుర్తించేందుకు అధికారులు రాత్రి పగలు పని చేస్తున్నారు. పదికి పైగా సంస్థలు అక్కడ వర్క్ చేస్తున్నాయి. దుర్ఘటన జరిగినప్పటి నుంచి చాలా సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. ఎన్ని సంస్థలు ఎన్ని విధంగాలు బాధితుల చెంతకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ పరిస్థితులు అనుకూలించ డం లేదు. టన్నెల్లో నిమిషానికి ఐదు వేల లీటర్ల నీళ్లు ఊరుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అప్రాంతంలో
భారీగా మట్టి, రాళ్లు, బురద పేరుకుపోయాయి. దీనికి తోడు నీరు ఉబికి వస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదు. సొరంగంలో ముందుకు కదిలే దారి కని పించడం లేదు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరువలో ఉన్నామని బుధవారం నీటిపారుదల మంత్రి ప్రకటించా రు. గురువారం నుంచి చర్యలలో వేగం పెంచుతున్నామని కూడా తెలిపారు. ఒక్కో అడ్డంకిని తొలగించిన అధికారు లు జీరో పాయింట్ వద్దకు చేరుకున్నారు. మళ్లీ సొరంగం కూలేప్రమాదం ఉందని అధికారులు చెప్పడంతో వారంతా వెనక్కి వచ్చేశారు. వెళ్లినంత వరకు తమకు ఎవరు కనిపిం చలేదని ర్యాట్ మైనింగ్ టీమ్ చెబుతోంది.
ఇదిలా ఉండగా, టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారి జాడ గుర్తించేందుకు అధికారులు రాత్రి పగలు పని చేస్తున్నారు. పదికి పైగా సంస్థలు అక్కడ వర్క్ చేస్తున్నాయి. దుర్ఘటన జరిగినప్పటి నుంచి చాలా సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. ఎన్ని సంస్థలు ఎన్ని విధంగాలు బాధితుల చెంతకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ పరిస్థితులు అనుకూలించడం లేదు. టన్నెల్లో నిమిషానికి ఐదు వేల లీటర్ల నీళ్లు ఊరుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అ ప్రాంతంలో భారీగా మట్టి, రాళ్లు, బురద పేరుకుపోయాయి. దీనికి తోడు నీరు ఉబికి వస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదు.