Hyderabad: ఆసియా కప్-2022లో విరాట్ కోహ్లీ సత్తాచాటాడు. ఇండియా ఆఫ్గానిస్తాన్ కు మధ్య గురువారం జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ కొట్టి కొత్త రికార్డ్ సృష్టించారు. దీనికి గానూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు కోహ్లీని ట్విట్టర్ వేదికగా అభినందించారు.
గత రాత్రి జరిగిన టీంఇండియాకు ఆఫ్గాన్ మధ్య జరిగిన ఆసియా కప్ టీ-20 మ్యాచ్లో ఫైర్ మ్యాన్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. ఆఫ్గాన్ పై సెంచరీ చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. చాలా రోజుల తరువాత బ్యాట్ పట్టుకున్న కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ పై చెలరేగి 61 బాల్స్ కు 122 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. క్రికెట్ చరిత్రలో టీ20 బ్యాటింగ్ ఫార్మాట్లో 100 సిక్సర్ల కొట్టి 3,500 పరుగుల మార్కును చేరుకున్న రెండో భారత బ్యాట్స్ మెన్ గా కోహ్లీ రికార్డుకెక్కారు. ఈ జాబితాలో హిట్ మ్యాన్ రోహిత్ 3,620 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నారు. దీనికి గానూ తెలంగాణ మంత్రి కేటీఆర్ విరాట్ కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
గత కొద్దికాలంగా విరాట్ పని అయిపోయిందని, అతను సరిగ్గా ఆడడం లేదని,భారత క్రికెట్ జట్టులో అతని కన్నా బాగా ఆడే ఆటగాళ్లు బెంచ్ కే పరిమతమయ్యారని ఇలా పలురకాలు విమర్శలు వచ్చాయి. కాగా ఈ విమర్శలన్నింటికీ గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో విరాట్ సెంచరీ కొట్టి గట్టి జవాబిచ్చారు.
Congratulations @imVkohli on your maiden T-20 Hundred & 71st international century 🎉
— KTR (@KTRTRS) September 8, 2022