Site icon Prime9

Minister Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్ కి తృటిలో తప్పిన ప్రమాదం..

Minister Gangula Prabhakar saved from boat accident

Minister Gangula Prabhakar saved from boat accident

Minister Gangula Kamalakar : తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పడవ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే బిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా పునరుద్దరించిన చెరువుల వద్ద వేడుకలు చేస్తున్నారు. ఈ మేరకు కరీంనగర్ రూరల్ మండలం అసిఫానగర్ చెరువు వద్ద జరిగిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. చెరువు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి గంగుల ప్రజలు, బిఆర్ఎస్ కార్యకర్తల కోరిక మేరకు నాటు పడవ ఎక్కారు. ఈ పడవపై చెరువునీటిలోకి వెళుతుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది.

నాటుపడవ నీటిలో బోల్తా పడటంతో మంత్రి గంగుల చెరువులో పడిపోయారు. కానీ ప్రమాదం జరిగిన ప్రాంతంలో లోతు తక్కువగా వుండటంతో మంత్రి గంగుల నడుచుకుంటూ బయటకు వచ్చారు. మంత్రి నీటిలో పడిపోయిన వెంటనే భద్రతా సిబ్బంది, పోలీసులు చెరువులోకి దిగారు. నీటిలో పడిపోయిన గంగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పడవ ప్రమాదం నుండి మంత్రి గంగుల కమాలాకర్ బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

Exit mobile version