Hyderabad: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు నేటినుంచి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తు న్నట్టు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ పేరిట దీనికి సంబంధించిన ప్రచార పోస్టర్లను బస్‌భవన్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థలోని దాదాపు 50 వేల మంది ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక దష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య డేటా బేస్‌ను తార్నాక ఆసుపత్రిలో నిక్షిప్తం చేస్తామన్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన వైద్య సలహాలు, మందులు ఇస్తామని తెలిపారు.
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మంగళవారం ఉద్యోగులకు 3 డీఏలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పండుగ అడ్వాన్స్‌లు, గతంలో డీఏ ఎరియర్స్‌ను సైతం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 47 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.