Site icon Prime9

Katakam Sudarshan: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్‌ మృతి

Katakam Sudarshan: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్‌ మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో ఆయన మరణించినట్టు మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ ప్రకటించింది. కటకం సుదర్శన్ అలియాస్ కామ్రేడ్ ఆనంద్ 69 సంవత్సరాల క్రితం ఒక కూలీ కుటుంబంలో జన్మించాడు. ఆయన స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలోని కన్నాలబస్తి. వరంగల్‌లో 1974లో మైనింగ్ డిప్లొమా చదివిన ఆయన శ్రీకాకుళం పోరాటాల స్ఫూర్తితో కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్శితులయ్యారు. దానితో 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో గడుపుతూ మావోయిస్టు పార్టీలో అంచలంచలుగా ఎదిగి సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. సుదర్శన్ ను ఆనంద్‌, మోహన్‌, వీరేందర్‌జీ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.

లక్సెట్టిపేట ఉద్యమంలో కీలక పాత్ర(Katakam Sudarshan)

ఆనంద్ అలియాజ్ సుదర్శన్‌పై హత్య కేసు సహా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ప్రాంతాల్లో మొత్తం 17 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. రెండేండ్ల క్రితం ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన మావోల దాడిలో సుదర్శన్‌ హస్తం ఉందని సమాచారం. ఇక దంతేవాడ దాడిలో దాదాపు 70 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన ఉత్తర తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దండకార్యణంలో ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఆదిలాబాద్ జిల్లా విప్లవోద్యమాన్ని నిర్మించేందుకు లక్సెట్టిపేట ప్రాంతంలోని భూ సంబంధాలను ఆయన అధ్యయనం చేశారు. ఆ లక్సెట్టిపేట ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సతీమణి, మావోయిస్టు నాయకురాలు సాధన గత కొన్నేండ్ల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె మృతి చెందారు.

Exit mobile version
Skip to toolbar