Site icon Prime9

Wine Shops: మందుబాబులకు బిగ్ షాక్.. ఇవాళ వైన్స్ బంద్

Wine Shops Across Hyderabad to be Closed on Sri Ram Navami

Wine Shops Across Hyderabad to be Closed on Sri Ram Navami

Wine Shops Across Hyderabad to be Closed on Sri Ram Navami: మద్యంప్రియులకు బిగ్ షాక్ తగిలింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా వైన్స్ షాపులను 24 గంటలపాటు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 6వ తేదీన మద్యం దుకాణాలను బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడు వైన్స్ షాపులు మూతపడనున్నాయి.

 

శ్రీరామనవమి పండుగ సందర్బంగా అన్ని ఆలయాలు రామజపంతో మార్మోగుతున్నాయి. అయోధ్య రామమందిరంతో పాటు వాడవాడలో నెలకొన్న ఆలయాలను ముస్తాబు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనందర్ మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Exit mobile version
Skip to toolbar