Site icon Prime9

MLC Kavitha: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అడ్డుకొన్న న్యాయవాదులు

Lawyers who blocked MLC Kavitha

Lawyers who blocked MLC Kavitha

Hyderabad: రంగారెడ్డి కోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె కోర్టుకు వచ్చారు. అయితే కవితను న్యాయవాదులు అడ్డుకొన్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలను పట్టించుకోకుండా, కోర్టుకు ఎలా వస్తారని కవితను నిలదీసారు. ఆమె క్యాన్వాయిని అడ్డకొన్నారు. దీంతో ప్రాంగణంలో ఉధ్రిక్తత చోటుచేసుకొనింది. అదుపు చేసేందుకు పోలీసుల యత్నించడంతో తోపులాటు చోటుచేసుకొనింది. కోర్టు ప్రాంగణంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతులు లేవంటూ న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వివిధ పోలీసు స్టేషన్లకు వారిని తరలించారు.

ఒక దశలో అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు న్యాయవాదులను హెచ్చరించారు. పోలీసుల తీరును న్యాయవాదులు తప్పబట్టారు. న్యాయవాదుల సమస్యలను పట్టించుకోలేదు. న్యాయవాదుల పై దాడులు చేస్తే కవిత ఏనాడు స్పందించ లేదు. హత్యలు చేసినా పట్టించుకోకుండా నేడు కోర్టుకు బతుకమ్మ సంబరాలకు ఎలా వస్తారని న్యాయవాదులు ఆమెను నీలదీసారు. మరో న్యాయవాదుల వర్గం పిలుపు మేరకు కవిత కోర్టుకు రావడం జరిగింది.

ఇది కూడా చదవండి: ఓబులాపురం గనుల దోపిడి పార్ట్ 2కు తెరలేపిన వైకాపా ప్రభుత్వం

Exit mobile version