Site icon Prime9

Alpha Hotel : సికింద్రాబాద్‌ లోని ఆల్ఫా హోటల్ సీజ్.. కారణం ఏంటంటే ?

latest news about secunderabad alpha hotel seize

latest news about secunderabad alpha hotel seize

Alpha Hotel : హైదరాబాద్‌లో నగరంలో ప్రసిద్ది గాంచిన హోటల్ లలో ఆల్ఫా హోటల్‌ గురించి అందరికీ తెలిసిందే. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉండే ఆల్పా హోటల్‌కు నిత్యం వేల మంది కస్టమర్లు వస్తూ ఉంటారు. టీ, కాఫీ లతో పాటు బిర్యానీ వరకు అన్ని ఇక్కడ లభిస్తాయి. అయితే అనూహ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సెప్టెంబర్ 17 వ తేదీన ఈ హోటల్ ను సీజ్ చేశారు. ఇక ఈ హోటల్‌ను సీజ్ చేయటానికి కారణం ఏంటని కస్టమర్లు అంతా ఆరా తీస్తున్నారు.

ఈ హోటల్ ని సీజ్ చేయడానికి కారణం.. మటన్ కీమా, రోటీలు. ఈ హోటల్‌లో కొందరు యువకులు మటన్ కీమా, రోటీ తిన్నారు. అనంతరం.. వాళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో సదరు యువకులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. హోటల్‌లో తనిఖీలు చేశారు. కాగా.. హోటల్‌లో నాణ్యత, శుభ్రత లేదని గుర్తించిన అధికారులు వెంటనే (Alpha Hotel) హోటల్‌ను సీజ్ చేశారు. కాగా అస్వస్థతకు గురైన యువకులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు.

కాగా ఇటీవల కాలంలో ఎక్కడికైనా వెళ్ళి తినలంటే ప్రజాలు ఒకరకంగా భయపడుతున్నారనే చెప్పాలి. పేరు గాంచిన హోటళ్లలో సైతం కల్తీ చేయడం, ఏమాత్రం నాణ్యత, శుభ్రత పాటించకుండా ఉంటుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆల్పా హోటల్‌ మీద గతంలోనూ పలు ఆరోపణలు రాగా.. అధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. కాగా.. మళ్లీ ఇలాంటి సంఘటన జరగటంతో అధికారులు డైరెక్టుగా సీజ్ చేసేశారు.

అయితే మరోవైపు ఇటీవల హైదరాబాద్ పంజాగుట్టలో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు కస్టమర్‌పై మెరిడియన్ రెస్టారెంట్ సిబ్బంది దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కస్టమర్ లియాఖత్ మృతి చెందగా.. పోలీసుల ముందే ఈ దాడి జరిగినా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంజాగుట్ట ఎస్సై శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మెరిడియన్ హోటల్‌ను తాత్కలికంగా మూసేశారు.

Exit mobile version