Site icon Prime9

KTR: నేడు కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

KTR Quash Petition Enquiry in Supreme Court Today: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో వచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసు వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ తెలంగాణ హైకోర్టు దీనిని తిరస్కరించింది. దీంతో కేటీఆర్ జనవరి 8వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారించనుంది. కాగా, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏసీబీ కేవియట్‌లు సైతం పిటిషన్ దాఖలు చేశాయి. ఇప్పటికే ఈ కేసులో అరవింద్, దానకిశోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగాకేటీఆర్‌ను విచారించారు.

ఇదిలా ఉండగా, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్.. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కార్ రేసు కోసం ఆర్బీఐ అనుమతి లేకుండానే చెల్లించడంతో కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఏసీబీ విచారించింది.

అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో నిర్వహించిన ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు ఆదాయం అంతగా రాలేదు. దీంతో ప్రమోటర్స్ వైదొలిగారు. ఆ వెంటనే అప్పటి మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీంతో 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన 2వ దఫా రేస్ నిర్వహణకు ఎఫ్ఈఓకు హెచ్ఎండీఏ రూ.55 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా ఓ విదేశీ సంస్థకు నిధులు ఇవ్వడంపై కాంగ్రెస్ సర్కార్ ప్రశ్నిస్తోంది.

Exit mobile version