Munugodu: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్యగా ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసారి అనసూయ (సీతక్క) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ప్రజలను పలకరిస్తున్న సీతక్క వెంకటరెడ్డి చర్యలను బహిరంగంగానే దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధిష్టానం వెంకటరెడ్డికి షోకాజ్ ఇవ్వడాన్ని ఆమె సమర్ధించారు. భాజపా అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని భావిస్తే, కాంగ్రెస్ కు రాజీనామా చేసి భాజపాలో చేరొచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాని నీతిమాలిన పనులు చేయడం సరికాదన్నారు. బంధాలకు అతీతమే రాజకీయాలుగా ఉండాలన్నారు. పార్టీ సిద్ధాంతాలు, నిబంధనలు పాటించిన్నప్పుడే నిబద్ధతకు అర్ధంగా పేర్కొన్నారు. ఓవైపు మునుగోడు ఉప ఎన్నికలు, మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ సమయంలో ఆస్ట్రేలియా పోవడం ఏంటని సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ మునుగోడులో గెలవదని, తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఆయన ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్ గా మారడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు షోకాజ్ జారీచేసింది. మనుగోడు ప్రచారంలో తాను పాల్గొననని ఖరాఖండిగా పార్టీకి చెప్పడంతో ఆయనపై పార్టీ శ్రేణులు గరం గరంగా ఉన్నారు. ఒక దశలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిని పాల్వాయి స్రవంతి వెంకటరెడ్డి ప్రవర్తనపై కలత కూడా చెందారు. అయితే టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి మాత్రం గెలుపే ప్రధానంగా ముందుకు పోతున్నారు.
ఇది కూడా చదవండి:Munugode by poll: దీపావళికి పేదరాలింటిని ముస్తాబు చేసిన ఎమ్మెల్యే సీతక్క…ఎందుకంటే?