Site icon Prime9

Kishan Reddy: కేసిఆర్ ఆరోపణలు హస్యాస్పదం…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

KCR's allegations are ridiculous

Telangana: ప్రధానమంత్రి మోదీ అండ్ టీం పై ఆరోపణలు గుప్పిస్తూ ఎమ్మెల్యేల కొనుగోల ప్రలోభాల డీల్ కేసుపై సీఎం కేసిఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కల్వకుంట్ల కుటుంబానికి, తెరాసకు ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని అందుకే ఈ నిందలుగా  పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యంపై కేసిఆర్ ఆవేదన వ్యక్తం చేయడం పట్ల హస్యాస్పదంగా ఉందని కొట్టిపారేశారు.

ఒకింత తీవ్ర అసహనంతో కేసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారన్నారు. పదేపదే చెప్పిందే చెప్పారన్నారు. ఆరోపణల అంశంలోని నిందుతులతో భాజపాకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. అమిత్ షా, నడ్డా, సంతోష్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసిఆర్ అందమైన అబద్దాలను సృష్టించారన్నారు. కిరాయి ఆర్టిస్టులతో, పార్టీ నేతలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది స్వయానా కేసిఆర్ అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: CM KCR: ప్రభుత్వాలను కూలుస్తున్నారు, ఇది సరికాదు.. మోదీకి కేసిఆర్ విజ్ఞప్తి

Exit mobile version