BRS Chief and former CM KCR Visited 2nd time to AIG Hospital: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు ఆసుప్రతికి వచ్చారు.
కేసీఆర్ శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీకి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి చేరుకున్నారు. శుక్రవారం కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. టెస్టుల తర్వాత శనివారం మరోసారి ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్ నిన్న మధ్యాహ్నం 2.30 గంటలకు ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో గంట పాటు ఉన్నారు. ఏఐజీ చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యుడు నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌కు పలు వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలపై వైద్యులు పలు సూచనలు చేశారు.
కేసీఆర్ కొన్నిరోజుల నుంచి జలుబుతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే నందినగర్ నివాసానికి వెళ్లనున్నారు. మరో ఐదు రోజులపాటు బంజారా హిల్స్‌లోని నందీనగర్‌లో కేసీఆర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోని బాత్ రూంలో కాలు జారీ పడి గాయమైన విషయం తెలిసిందే. అనంతరం యశోద ఆస్పత్రిలో కొన్నిరోజుల పాటు చికిత్స పొందారు. అనంతరం ఫామ్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.