JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణలో పర్యటించనున్నాడు. మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్న నవ సంకల్ప సభకు హాజరుకానున్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ బహిరంగ సభకు నవ సంకల్ప సభగా నామకరణం చేశారు. కాగా బీఆర్‌ఎస్ తో పోరుపై బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందంటూ ప్రచారం జరుగుతున్న వేళ నడ్డా రాష్ట్ర పర్యటనకు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదంతా ఒకెత్తు అయితే నడ్డా నేడు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను కలిశారు. జూబ్లీహిల్స్‌లో ఉంటున్న క్లాసికల్ డ్యాన్సర్.. పద్మశ్రీ ఆనంద శంకరని, అనంతరం ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావును కలిశారు. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ళ పాలన, అభివృద్ధి గురించి వివరించి వారికి పుస్తకాలు అందజేశారు.
నోవాటెల్ హోటల్‌కు విశ్రాంతి తీసుకుని అనంతరం నాగర్ కర్నూల్ సభకు హెలికాప్టర్‌లో బయలుదేరతారు. 4.45 నిమిషాలకు నాగర్ కర్నూల్‌కు చేరుకుని.. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నాగర్ కర్నూల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం 6.10నిమిషాలకు నాగర్ కర్నూల్ నుంచి బయలుదేరి 6.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7.40 నిమిషాలకు ఎయిర్ పోర్ట్ నుంచి నడ్డా తిరువనంతపురంకు బయలుదేరి వెళ్తారు.