Warangal: ఇంటర్ ఫలితాలు కొందరు విద్యార్ధుల్లో ఎక్కడా లేని భయాలను సృష్టిస్తున్నాయి. ఫలితాలు రాకముందే.. తాను ఫెయిల్ అవుతానని చాలామంది విద్యార్ధులు అఘయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఫలితాలు రాకముందే ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా చూస్తే.. ఆ విద్యార్ధి ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించాడు.
ఫలితాలు రాకముందే..
ఇంటర్ ఫలితాలు కొందరు విద్యార్ధుల్లో ఎక్కడా లేని భయాలను సృష్టిస్తున్నాయి. ఫలితాలు రాకముందే.. తాను ఫెయిల్ అవుతానని చాలామంది విద్యార్ధులు అఘయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఫలితాలు రాకముందే ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా చూస్తే.. ఆ విద్యార్ధి ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించాడు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పిక్లా తండా శివారు బోడగుట్ట తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి గుగులోతు కృష్ణ(19) ఇంటర్ ఫలితాల్లో (బైపీసీ విభాగం) 892/1000 మార్కులు సాధించి ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఫలితాలు రాకముందే.. ఫెయల్ అవుతానని భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికుల హృదయాలను కలచివేసింది.
గత నెల 10న తాను బాగా చదవలేదని.. జీవితంలో వెనకబడుతున్న అని లేఖ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ వెలువడిన ఫలితాల్లో అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణుడైన విషయం తెలుసుకొని.. కృష్ణ జీవితంలో ఫెయిల్ అయ్యాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ‘కొడుకా.. లేనిపోని అనుమానంతో ఉరేసుకొని చనిపోతివి.. ఇప్పుడు ఇంటర్ పరీక్షల్లో గిన్ని మార్కులతో పాసయితివి’ అంటూ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.