Prime9

Metro Ticket Price Revised: తగ్గిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు.. తాజా రేట్లు ఇవే!

Hyderabad Metro Ticket Price Revised: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. కొద్దిరోజుల క్రితం 20 శాతం మేర మెట్రో టికెట్ ధరలను పెంచింది. దీంతో పెద్దఎత్తున్న వ్యతిరేకత వచ్చింది. దీంతో తాజాగా 10 శాతం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్టు ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు సవరించిన ఛార్జీల వివరాలను తెలుపుతూ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా సవరించిన ఛార్జీలతో కనిష్టంగా 2 కి.మీ. లోపు ప్రయాణానికి టికెట్ ధర రూ. 11గా నిర్ణయించింది. గరిష్ట టికెట్ ధర రూ. 69 గా నిర్ణయించింది. తగ్గిన టికెట్ ధరలు మే 24 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పింది.

తగ్గింపు తర్వాత మెట్రో టికెట్ ధరలు..

* 2 కి.మీ. వరకు రూ. 11

* 2 నుంచి 4 కి.మీ. వరకు రూ. 17

* 4 నుంచి 6 కి.మీ. వరకు రూ. 28

* 6 నుంచి 9 కి.మీ. వరకు రూ. 37

* 9 నుంచి 12 కి.మీ. వరకు రూ. 47

* 12 నుంచి 15 కి.మీ. వరకు రూ. 51

* 15 నుంచి 18 కి.మీ. వరకు రూ. 56

* 18 నుంచి 21 కి.మీ. వరకు రూ. 61

* 21 నుంచి 24 కి.మీ. వరకు రూ. 65

* 24 నుంచి ఆపైన వరకు రూ. 69 గా నిర్ణయించారు.

Exit mobile version
Skip to toolbar