hyderabad metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్ లపై రాయతీ కల్పించిన మెట్రో.. ఇక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనుంది. ఇక రోజులో ఆరు గంటలు మాత్రమే.. రాయితీ వర్తించేలా చర్యలు తీసుకోనుంది. ఇంది ప్రయాణీకులపై భారం పడనుంది.
ఆరు గంటలు మాత్రమే రాయితీ..
హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్ లపై రాయతీ కల్పించిన మెట్రో.. ఇక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనుంది. ఇక రోజులో ఆరు గంటలు మాత్రమే.. రాయితీ వర్తించేలా చర్యలు తీసుకోనుంది. ఇంది ప్రయాణీకులపై భారం పడనుంది. ప్రయాణీకుల రద్దీ సమయంలో వీటిని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.
మెట్రో ఛార్జీలు పెరుగుతాయని అందరు భావించారు. కానీ దానికి భిన్నంగా మెట్రో నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల రాయితీ రద్దవుతుంది. ఉదయం 6 గంటల నుంచి 8 దాకా.. అలాగే రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే పది శాతం రాయితీ ఉంటుందని తెలిపింది. కావున.. ఉదయం 8 నుంచి.. రాత్రి 8 దాకా ఎలాంటి రాయితీ వర్తించదు అన్నమాట. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిపై మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటన చేశారు.
పెరగనున్న హలీడే ధర.. (hyderabad metro)
గతంలో మెట్రో జారీ చేసిన సూపర్ సేవర్ ఆఫర్.. నేటీతో ముగుస్తుంది. తాజాగా సూపర్ సేవర్ ధరలను రూ. 59 నుంచి రూ. 99 గా నిర్ణయించారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చ్ 31 వరకు 99 రూపాయలుగా ఉండనుంది. సెలవు దినాల్లో ఈ కార్డు ఉపయోగపడుతుంది.
రూ. 59 రీచార్జ్ తో ఇప్పటివరకు ఎక్కడినుంచి ఎక్కడికైన తిరిగే అవకాశం ఉంది. ఇపుడు దానిని రూ.99 గా నిర్ణయించారు. ప్రతి రోజు మెట్రోలో 4.4 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు.
ప్రయాణీకులపై భారం..
పది శాతం రాయితీని ఉపసంహరించడంతో.. ప్రయాణీకులకపై భారం పడనుంది. ప్రతిరోజు ప్రయాణం చేసే వారికి ఇది అదనపు భారం కానుంది.
ప్రతి రోజు మెట్రోలో ప్రయాణించే ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. వారిపై ఈ భారం మరింత పడనుంది.
ఎక్కువగా ఉదయం 9 నుంచి 11 గంటల సమయంలో మెట్రో రైళ్లు రద్దీగా ఉంటాయి. ఆఫీసులు, కార్యాలయాలు సాయంత్రం 6 నుంచి 8 గంటల సమయంలో ముగుస్తాయి.
దీంతో ఈ సమయంలో మెట్రో రైళ్లు కిటకిటలాడుతుంటాయి. అలాంటి సమయంలో రాయితీని ఎత్తివేసి ప్రయాణికులు లేని సమయంలో రాయితీని కొనసాగించడం పట్ల విమర్శలు వస్తున్నాయి.