Hyd Airport Metro: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ మరో ముందడుదు వేసింది. రాయదుర్గం నుంచి విమనాశ్రయం వరకు నిర్మించే మెట్రో స్టేషన్ల సంఖ్యపై స్పష్టతనిచ్చింది. ఈ మార్గంలో 9 స్టేషన్లు నిర్మించనున్నట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో తెలిపింది. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు 31 కి.మీ. మార్గంలో మెట్రో నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ మరో ముందడుదు వేసింది. రాయదుర్గం నుంచి విమనాశ్రయం వరకు నిర్మించే మెట్రో స్టేషన్ల సంఖ్యపై స్పష్టతనిచ్చింది. ఈ మార్గంలో 9 స్టేషన్లు నిర్మించనున్నట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో తెలిపింది. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు 31 కి.మీ. మార్గంలో మెట్రో నిర్మిస్తున్నారు.
టెండర్ల ప్రక్రియ మెుదలు కావడంతో.. 9 స్టేషన్లను హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రకటించింది. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు.. 31 కి.మీ ఈ మెట్రోను నిర్మించారు. రాయదుర్గం వద్ద మొదటి స్టేషన్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాతి స్టేషన్లు ఇలా ఉన్నాయి. బయోడైవర్సిటీ కూడలి, నానక్‌రాంగూడ కూడలి, నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్ పట్టణం, విమానాశ్రయంలో జాతీయ రహదారి (ఎన్‌హెచ్)కు కొద్దిదూరంలో, విమానాశ్రయం టెర్మినల్‌లో భూగర్భ మెట్రోస్టేషన్‌తో ముగుస్తాయి.
ఈ మెట్రో ప్రణాళిక బద్ధంగా నిర్మించనున్నారు. వంపులు లేని చోట స్టేషన్లను నిర్మిస్తారు. మధ్యలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే.. గుత్తేదారులకు మార్పులకు అవకాశం ఇస్తారు. మెట్రో ప్రయాణ వేగం, బ్రేకింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిని ఖరారు చేస్తారు. భవిష్యత్తు అవసరాల కోసం మరో 4 స్టేషన్లు ఏర్పాటు చేసుకునేలా అలైన్‌మెంట్‌ను డిజైన్ చేశారు. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ పట్టణం మధ్యలో చాలా దూరం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. ఎక్కువ సంస్థలున్నాయి. జనావాసాలు విస్తరిస్తే ఇక్కడ కూడా స్టేషన్ వచ్చే సూచనలున్నాయి.