Site icon Prime9

Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం!

Hyderabad Rains

Hyderabad Rains

Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బషీర్‌బాగ్‌, లక్డీకపూల్‌, లిబర్టీ, నాంపల్లి, లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, జియాగూడ, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, బోరబండ, సనత్‌నగర్‌, శేరిలింగంపల్లి, మియాపూర్‌, మదీనగూడ, చందానగర్‌లో భారీగా వర్షం కురుస్తున్నది. లింగంపల్లి, కొండాపూర్‌, గచ్చిబౌలితోపాటు సికింద్రాబాద్‌ పరిధిలోని బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి అల్వాల్‌, బొల్లారం, ప్యాట్నీ, పార్యడైజ్‌, చిలుకలగూడ, బేగంపేట పలు ప్రాంతాల్లో వాన పడుతోంది.

 

వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై పెద్దఎత్తున వరద నిలిచిపోయింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌తో తెలంగాణవ్యాప్తంగా రాబోయే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ జారీ చేసింది.

 

Exit mobile version
Skip to toolbar