Site icon Prime9

Harish Rao: డియర్ అచ్చు.. అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయిన మంత్రి హరీష్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao: తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తనయుడు ఆర్చిష్మాన్‌ సివిల్ ఇంజనీరింగ్ లో పట్టా అందుకున్నారు. కొలరాడో స్టేట్, బౌల్డర్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి ఆర్చిష్మాన్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఈ సందర్భంగా తన కుమారుడి గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ఆయన పాల్గొన్నారు. విజయాన్ని ఆనందిస్తూ ఫొటోలు, వీడియోను హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకోవడంతో పాటు, గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌ అవార్డు రావడం ఆనందంగా ఉందని హరీష్ రావు తెలిపారు. కుమారుడి విజయంపై గర్వపడటం లేదన్న హరీశ్‌రావు.. ఈ విజయం ఆర్చిష్మాన్‌ పట్టుదల, అభిరుచికి నిదర్శనమని చెప్పారు.

 

 

అపురూపమైన మైలురాయి

ఈ నైపుణ్యంతో ఆర్చిష్మాన్‌ ప్రపంచంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రియమైన అచ్చు.. అంటూ కుమారుడికి అభినందనలు తెలిపారు. ఇది అపురూపమైన మైలురాయి అని అభివర్ణించారు. కుమారుడి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోవడంతో పుత్రోహంతో హరీష్ రావు ఉప్పొంగిపోయారు. దీంతో హరీష్ రావు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్చిష్మాన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar