Site icon Prime9

Governor Tamilisai: ‘దేవుడు నన్ను తెలంగాణకు పంపడం గొప్ప అదృష్టం’

Governor Tamilisai

Governor Tamilisai

Governor Tamilisai: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన అవతరణ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా రాజ్ భవన్ లో కేక్ కట్ చేశారు. అక్కడ నృత్యకారులతో కలిసి తమిళసై ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అనంతరం ఆమె అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకత చాటుకుంటోందని ఆమె తెలిపారు.

తెలంగాణ అమరవీరులకు పేరపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. తొలి దశ ఉద్యమంలో 300 మంది అమరులయ్యారని తమిళసై గుర్తు చేసుకున్నారు. తెలంగాణ అంటే స్లోగన్ కాదని.. అది ఆత్మ గౌరవ నినాదమన్నారు. రాష్ర్ట అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆమె ఆంకాక్షించారు.

 

దేశంలోనే నెంబర్ 1 గా(Governor Tamilisai)

తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ ఒక్కటి మాత్రమే కాదని గవర్నర్ తెలిపారు. రాష్ర్టంలోని మారుమూల పల్లెలకు సైతం అభివృద్ధి ఫలాలు అందాలన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుకుందామని తమిళ సై అన్నారు. తన జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే అని.. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానట్టు గవర్నర్ తెలిపారు. దేవుడు నన్ను తెలంగాణకు పంపడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఐ లు చేయూత ఇవ్వాలని గవర్నర్ ఈ సందర్భంగా కోరారు.

 

Exit mobile version