Prime9

Former MP Harish Rao: వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. సీఎంకు హరీష్‌రావు సవాల్

Former MP Harish Rao Open Challenge to cm Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పోలీస్, అధికారులను హెచ్చరించారు. కార్యకర్తలను వేధిస్తే రెడ్‌బుక్‌లో పేర్లు రాస్తామన్నారు.

 

బడా కాంట్రాక్టర్లకు రూ.12వేల కోట్లు కట్టబెట్టారన్నారు. మిల్లా మ్యాగీతో అసభ్యంగా ప్రవర్తించారని ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్‌పై ఆరోపణలు వస్తున్నాయన్నారు. సీసీఫుటేజీ విడుదల చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

 

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్‌కు వంద సీట్లు ఖాయమని హరీశ్ రావు తెలిపారు. అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి అని, అబద్ధాల్లో రేవంత్ రెడ్డి అగ్రగామి అని ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు సీఎం చెబుతున్నారన్నారు. అన్ని వేల కోట్లు రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు.

Exit mobile version
Skip to toolbar