Site icon Prime9

Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధం..ఆర్వో రోహిత్ సింగ్

Everything is ready for Munugode by-election..Returning Officer Rohit Singh

Everything is ready for Munugode by-election..Returning Officer Rohit Singh

Munugodu: నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలకు సర్వం సిద్దం చేసిన్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ రోహిత్ సింగ్ మీడియాతో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల మేర నాకా బంద్ (చెక్ పోస్టు)లో ఇప్పటివరకు రూ. 1,48,44,160 స్వాధీనం చేసుకొన్నామన్నారు.

లక్ష రూపాయలు విలువచేసే మద్యం సీజ్ చేసిన్నట్లు తెలిపారు. 2,41,805 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వ్యాఖ్యానించారు. గల్లంతైన ఓటర్లు తమ ఓట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలను పాటిస్తున్నట్లు పేర్కొన్న రోహిత్ సింగ్, ఈవీఎం మిషన్లు రెడీగా ఉన్నాయని, వాటి కండిషన్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మాక్ పోలింగ్ లో ఎలాంటి సమస్య ఉత్పన్నం తలెత్తలేదన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లను చేశామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు ఆర్వో స్పష్టం చేశారు. ఓటింగ్ అనంతరం నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరపనున్నారు.

ఇది కూడా చదవండి: Munugode by poll: మునుగోడు రిటర్నింగ్ అధికారి పై ఈసీ వేటు.. ఓ పార్టీ అభ్యర్ధి గుర్తు మార్చడంతో ఈసీ సీరియస్

Exit mobile version