Site icon Prime9

Nizam College: నిజాం కాలేజీ హాస్టల్ వివాదానికి ముగింపు.. కొత్త బిల్డింగ్ అంతా వారికే..

Nizam College

Nizam College

Hyderabad: నిజాం కాలేజీ హాస్టల్ కొత్త బిల్డింగ్ అంతా తమకే కేటాయించాలంటూ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్దులు చేసిన పోరాటం ఫలించింది. ఇది వారికే కేటాయించాలని ప్రభుత్వం అంగీకరించింది. కొత్తగా నిర్మించిన హాస్టల్‌ను పూర్తిగా అండర్ గ్రాడ్యూయేట్ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిజాం ప్రిన్సిపాల్ సర్క్యూలర్‌ విడుదల చేశారు. హాస్టల్ వసతి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ అవకాశం కల్పిస్తామని ఏమైనా మిగిలితే పీజీ వారికి ఇస్తామన్నారు. హాస్టల్ ఫెసిలిటీ కోసం యూజీ సెకండ్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు.

నిజాం కాలేజీలో ఇటీవల కొత్త హాస్టల్ భవనాన్ని నిరమించారు దీన్ని మొత్తం పీజీ విద్యార్థులకే ఇవ్వాలని మొదట నిర్ణయించారు. అయితే యూజీ విద్యార్థులు ఈ నిర్ణయం పై నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీంతో సమస్యను పరిష్కరించాలని వెంటనే మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కేటీఆర్ కోరారు. ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డి కూడ అధికారులకు పలు సూచనలు చేసారు. అయితే అవేమీ విద్యార్థినులకు నచ్చలేదు. దాంతో వారు ఆందోళన కొనసాగించారు. హాస్టల్ మొత్తం యూజీ విద్యార్థులకు కేటాయించాల్సిందేనన్న ఒక్క డిమాండ్‌కే వారు మొగ్గు చూపారు. మొత్తం మీద వారి డిమాండ్ ను మన్నిస్తూ ఈ హాస్టల్ వివాదానికి ముగింపు పలికారు.

Exit mobile version