Site icon Prime9

Nehru Zoological Park : హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో షాకింగ్ ఘటన.. ఏనుగు దాడిలో ఉద్యోగి మృతి

elephant attack on Nehru Zoological Park employe

elephant attack on Nehru Zoological Park employe

Nehru Zoological Park : హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జూలో ఉన్న ఓ ఏనుగు దాడి చేయడంతో ఓ ఉద్యోగి మరణించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఊహించని ఘటనలో వివరాల్లోకి వెళ్తే..  షైబాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ జూలో యానిమల్ కీపర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఏనుగు అదుపుతప్పి ప్రవర్తించడంతో షైబాజ్ మృత్యువాతపడ్డాడు.

నెహ్రూ జూ పార్క్ 60 ఏళ్ల ఉత్సవం సందర్భంగా ఇతర ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లగా..  ఏనుగుల ఎన్ క్లోజర్ లో షైబాజ్ ఒక్కడే విధుల్లో ఉన్నాడు. అయితే ఒక్కసారిగా ముందుకొచ్చిన ఏనుగు అతడిని నేలకేసి విసిరికొట్టింది. అయితే షైబాజ్ కు తీవ్ర గాయాలు కాగా.. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అతని వయస్సు 28 ఏళ్లని తెలుస్తుంది. షైబాజ్ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.

Exit mobile version