Dr. BR Ambedkar: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా.. హెలికాప్టర్ ద్వారా విగ్రహంపై పూల వర్షం కురిపించారు. విగ్రహావిష్కరణకు ముందు బౌద్ధ గురువులు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, భారాస కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠాన్ని నిర్మించి, దాని పైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఉంచారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలానే బీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది. ఇంకా ఆ విగ్రహం ప్రత్యేకతలు మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహంగా ఇది పేరుగాంచింది.
ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు.
ఈ విగ్రహం బరువు సుమారు 465 టన్నులు ఉంటుంది. ఇందుకోసం 96 టన్నుల ఇత్తడి వాడారు.
విగ్రహం ఖర్చు రూ.146 కోట్లు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు.
ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, వెడల్పు 172 అడుగులు. పార్లమెంటు ఆకారంలో నిర్మించిన పీఠం లోపల సందర్శనాలయం ఉంటుంది.
11.04 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అందులో 2.93 ఎకరాల్లో థీమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రాజెక్టు స్థలంలో విగ్రహమే కాకుండా, పీఠం కింద ఒక లైబ్రరీ, మ్యూజియం, జ్ఙాన మందిరం, అంబేడ్కర్ జీవిత ముఖ్య ఘట్టాల ఫోటో గ్యాలరీ ఉంటాయి.