Site icon Prime9

Muthireddy Yadagiri: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కూతురు ఫిర్యాదు.. స్పందించిన ఎమ్మెల్యే

muthireddy

muthireddy

Muthireddy Yadagiri: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వివాదాల్లో చిక్కుకున్నారు. స్వయన ఎమ్మెల్యే కుమార్తె తండ్రిపై కేసు పెట్టారు. ఈ వివాదం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఆమె కూతురు ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ఓ ల్యాండ్ విషయంలో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

కారణం ఇదే.. (Muthireddy Yadagiri)

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వివాదాల్లో చిక్కుకున్నారు. స్వయన ఎమ్మెల్యే కుమార్తె తండ్రిపై కేసు పెట్టారు. ఈ వివాదం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఆమె కూతురు ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ఓ ల్యాండ్ విషయంలో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే కూతురు తుల్జాభవని రెడ్డి ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. నాచారంలో 159 గజాల భూమి విషయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు.. ఆయనపై సెక్షన్ 406, 420, 463,464,468, 471, R/w 34ipc,156 (3)crpc ప్రకారం కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది.

వివాదాల్లో ఎమ్మెల్యే..

జనగామ ఎమ్మెల్యే ఎక్కువగా వివాదాల్లో నిలుస్తుంటారు. ఖాళీ జాగా జాగా కనిపిస్తే కబ్జా చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. నాచారంలో తన పేరిట ఉన్న ప్లాట్ ను ఫోర్జరీ సంతకాలతో లీజ్ అగ్రిమెంట్ చేయించాడని కూతురు తూల్జ భవాని రెడ్డి ఉప్పల్‌ స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే పై చీటింగ్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

యశ్వంతపూర్‌లో బతుకమ్మ కుంటలో 6 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం హై కోర్టు వరకు వెళ్లింది.

ఈ వివాదంలో అప్పటి కలెక్టర్ దేవసేనతో ముత్తిరెడ్డికి గొడవ సైతం జరిగింది.

నర్మెట్ట మండలం హన్మంతపూర్ శివారులో ప్రభుత్వ భూమి 70 ఎకరాలు ఎమ్మెల్యే కబ్జా చేశాడని ఆరోపణలున్నాయి.

దీంతో పాటు చేర్యాలలో ఎకరం 20 గుంటలు ఆక్రమించాడని ఆరోపణలు ఉన్నాయి.

గొల్లకురుమలు జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన భూమిని సైతం ఎమ్మెల్యే వదల లేదనే ఆరోపణలు ఉన్నాయి.

 

కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే

కూతురు తనపై పెట్టిన కేసు పట్ల ఎమ్మెల్యే స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఎలాంటి సంతకం ఫోర్జరీ చేయలేదని వివరించారు.

చేర్యాలలో సర్వే నెం 1402లో 1200 గజాల ల్యాండ్‌ తన బిడ్డ పేరు మీదే రిజిస్టర్ చేసి ఉందని, ఇందులో ఎలాంటి అవినీతి, ఫోర్జరీ జరగలేదని తెలిపారు.

కొందరు కావాలనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులే..కూతురిని ఉపయోగించి తనపై ఉసిగొలుపుతున్నారని విమర్శించారు.

ఇది కేవలం కుటుంబ సమస్యేనని.. ప్రతి కుటుంబంలో ఇలాంటివి సహాజమేనని అన్నారు.

Exit mobile version
Skip to toolbar