CM Revanth Reddy Good News For farm laborers: మహా శివరాత్రి పండగ పూట రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఉపాధి కూలీల ఖాతాల్లోకి రూ.6వేలు జమ చేసింది. ఎన్నిలక కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి రైతుల ఖాతాల్లోకి రూ.6వేల చొప్పున నగదు జమ చేసింది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 83,420 మందికి రూ.50.65 కోట్లు చెల్లించింది. అంతకుముందు మొదటి విడతలో 18,180 మందికి నగదు జమ చేయగా.. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
అయితే, ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్క కోరగా.. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ రెండు జిల్లాల్లో 66,240 మందికి రూ.39.74 కోట్లు జమ చేసింది. ఈ పథకం కింద ఏడాదికి రెండుసార్లు రూ.6వేలు చొప్పు మొత్తం రూ.12 వేలు ఇవ్వనుంది.