Site icon Prime9

CM Revanth Reddy : ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చుకొని పాక్‌కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలి : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్‌ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డిపాటు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, భారత్‌ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీసంఖ్యలో నగరవాసులు పాల్గొని పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు.

 

 

మరోసారి పాక్‌ను ఓడించాలి..
దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఏకమై ఉగ్రవాదంపై పోరాడాలని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు. భారత్‌లోకి చొరబడి పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు. ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల మంది భారతీయులు ప్రధాని మోదీ వెంట ఉంటారని తెలిపారు. ఈ విషయంలో మోదీకి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 1971లో పాక్‌కు ఇందిరాగాంధీ గట్టిగా బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. ఆనాడు ఇందిరాగాంధీని దుర్గామాతతో వాజ్‌పేయి పోల్చారని కొనియాడారు. మరోసారి పాక్‌ను ఓడించాలని స్పష్టం చేశారు. పీవోకేను భారత్‌లో కలపాలని కోరారు. ఇందిరాగాంధీని గుర్తుకుతెచ్చుకొని పాకిస్థాన్‌కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని హితవు పలికారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న భారత్‌పై ఉగ్రదాడి జరిగిందని, పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరు జరపారాలన్నారు. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఉగ్రదాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలన్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar