CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ సల్వ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గమనించి గచ్చిబౌలి లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
స్వల్ప అస్వస్థత..
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుననారు. కేసీఆర్ కు అక్కడి వైద్యులు చికిత్స అందించారు. కేసీఆర్‌తో పాటు ఆయన సతిమణీ కూడా ఆస్పత్రికి వచ్చారు. ఈ మేరకు కేసీఆర్ ఆరోగ్యంపై ఏఐజీ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేసీఆర్ ఈ రోజు ఉదయం కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు కేసీఆర్ కు సిటీ, ఎండోస్కోపి చేశారు. కడుపులో చిన్నపాటి అల్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దానికి సంబంధించిన మందులను కేసీఆర్ కు అందించారు.
అంతకుముందు కూతురు కవితతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఈ సమావేశం జరిగింది. ఈనెల 16 కవిత ఈడీ విచారణకు మళ్లీ హాజరుకానున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఇద్దరూ శోభరావుకు వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు.