Site icon Prime9

CM KCR: మోదీ హైదరాబాద్ పర్యటనకు ఈసారి కూడా సీఎం కేసీఆర్ దూరం.. కారణం ఏంటో తెలుసా?

CM KCR

CM KCR

CM KCR: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. ఈ ఇరు పార్టీల నడుమ పచ్చగడ్డివేస్తే భగ్గు మనేలా మాటల తూటాలు పేలూతూ ఉంటోన్నాయి. ఓవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కేంద్రం, ఎమ్మెల్సీ కవితను ముప్పుతిప్పులు పెడుతుండగా.. మరోవైపు తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం కేంద్ర రాష్ట్ర రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ తరుణంలోనే నేడు హైదరాబాద్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రావడం తీవ్ర ఉత్కంఠతను నెలకొల్పుంతుంది.

అందులోనూ ఇది అధికారిక పర్యటన అవడం, తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సాలు ఉండటంతో సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ టూర్ లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపింది కేంద్రం. అంతేకాకుండా ప్రారంభోత్సవాల అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే పబ్లిక్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ ప్రసంగించడానికి 7 నిమిషాల టైం కూడా కేటాయించింది. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఈ పర్యటకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సమాచారం.

అవమానించి పిలిస్తే వస్తమా(CM KCR)..

కరోనా సమయంలో జీనోమ్ వ్యాలీకి ప్రధాని వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించకుండా మోదీ ప్రోటోకాల్ ను పాటించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కానీ, ఆ తర్వాత పలు కార్యక్రమాలకు హైదరాబాద్ వచ్చిన మోదీ ప్రోగ్రామ్ లకు ప్రోటోకాల్ ప్రకారం పీఎంవో ఆహ్వానం పంపినా కూడా ఏ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ఈసారి కూడా సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీ పర్యటనకు దూరంగానే ఉంటారు అంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు.

పీఎంవో ప్రోటోకాల్ పాటించకుండా సీఎం కేసీఆర్ ను అవమానపరిచారు. రాజ్యాంగబద్దంగా ఉన్న చీఫ్ మినిస్టర్ హోదాని చులకనగా చూశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు సీఎం కేసీఆర్ వస్తానని అన్నా దానికి ప్రధాని మోదీ అంగీకరించకుండా ఆయన నేను ఒక్కడినే వస్తా ఒక్కడినే చూస్తా ఒక్కడినే పోతా అంటూ చెప్పారని అందుకే ఇప్పుడు మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోమంటూ వినోద్ కుమార్ ప్రకటించారు.

కాగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ టూర్ లో భాగంగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ లో వివిధ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవాలు, ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తారు. అనంతరం జరుగనున్న బహిరంగ సభలో ప్రసగించి తిరుగు రాజధాని పయనం అవుతారు.

Exit mobile version