CM KCR: హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఇది కేవలం విగ్రహాం కాదని.. ఒక విప్లవం అని అన్నారు. అంబేద్కర్ భారీ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
విగ్రహం కాదు.. ఒక విప్లవం (CM KCR)
హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఇది కేవలం విగ్రహాం కాదని.. ఒక విప్లవం అని అన్నారు. అంబేద్కర్ భారీ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. అంబేద్కర్ విశ్వ మానవుడని.. ఆయన సూచించిన మార్గాలు విశ్వజనీనమైనవని అన్నారు. ఎవరో డిమాండ్ చేస్తే.. ఈ విగ్రహం ఏర్పాటు చేయలేదని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి.. 70 ఏళ్లు దాటిన ఇంకా దళితులకు సరైన న్యాయం జరగడం లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
దళితుల కోసం అంబేద్కర్ కన్న కలలు సాకారం కావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగానే.. విశ్వమానవుడి విశ్వరూపాన్ని ప్రతిష్ఠించుకున్నామని తెలిపారు. ఆయన సూచించిన మార్గాల్లో నడవాలనే ఉద్దేశంలో సచివాలయానికి సమీపంలో ఆకాశమంత అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించినట్లు తెలిపారు. అంబేడ్కర్ పేరిట ప్రతి ఏటా అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారు. దీని కోసం.. ప్రత్యేకంగా రూ.51 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిపై ప్రతి ఏటా రూ.3కోట్ల వరకు వడ్డీ వస్తుందన్నారు. అంబేడ్కర్ జయంతి రోజున ఉత్తమ సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డు ప్రదానం చేస్తామని తెలిపారు.
రానున్న రోజుల్లో అధికారం మనదే..
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని కేసీఆర్ అన్నారు.
అధికారంలోకి వచ్చాక దేశంలో ఏటా 25 లక్షల దళిత కుంటుంబాలకు దళిత బంధు అమలు చేస్తామని ప్రకటించారు.
మహారాష్ట్రలో భారాసకు గొప్ప స్పందన వచ్చింది. యూపీ, బిహార్‌లో కూడా స్పందన వస్తుంది. మహారాష్ట్ర తరహాలోనే దేశమంతా స్పందించే రోజు వస్తుంది.
ఈ మాటలు కొందరికి మింగుడు పడక పోవచ్చు. రాష్ట్రంలో ఇప్పటిరకు 50వేల మందికి దళితబంధు అందింది.
ఈ సంవత్సరం మరో 1.25 లక్షల మందికి దళితబంధు అమలు చేస్తాం. ఎస్సీల అభ్యున్నతి కోసం తెచ్చిన కార్యక్రమం దళితబంధు.
వాస్తవ కార్యాచరణ దిశగా ఎస్సీ మేధావులు కదలాలి అని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.