10th Exams: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో హిందీ పేపర్ లీకేజీకి కారణమైన విద్యార్ధి హరీష్ ను డిబార్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విద్యార్ధికి తాజాగా హై కోర్టులో ఊరట లభించింది.
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో హిందీ పేపర్ లీకేజీకి కారణమైన విద్యార్ధి హరీష్ ను డిబార్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విద్యార్ధికి తాజాగా హై కోర్టులో ఊరట లభించింది.
కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ పేపర్ బయటకు వచ్చినట్లు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే.. వాట్సాప్ లో హిందీ పేపర్ చక్కర్లు కొట్టింది. పదో తరగతి పరీక్ష రాస్తున్న.. హరీష్ అనే విద్యార్ధి నుంచి ఇది బయటకు వచ్చినట్లు తేలింది. దీంతో చీఫ్ సూపరింటెండెంట్ ఆ విద్యార్ధిని ఐదేళ్ల పాటు డిబార్ చేశారు.
అయితే ఈ లీకేజీలో తన ప్రమేయం లేదని బాధిత విద్యార్ధి ఆరోపించాడు. అతడ్డి తల్లి బోరున విలపించి.. అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.
హిందీ పేపర్ అనంతరం.. ఆ విద్యార్ధి ఆంగ్ల పరీక్ష రాయడానికి వచ్చాడు. అతడిని పిలుపించుకొని.. డీఈఓ మందలించారు.
తనను పరీక్ష రాయనివ్వలేదని ఆ విద్యార్ధి ఆవేదన చెందాడు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్ధి తండ్రి తెలంగాణ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
గోడదూకి పరీక్షా కేంద్రంలోకి వచ్చిన శివ కృష్ణ.. పరీక్ష రాస్తున్న హరీశ్‌ను భయపెట్టి ప్రశ్న పత్రం తీసుకున్నాడని పిటిషన్‌లో పేర్కొన్నారు.
హరీశ్ పేపర్ తీసుకుని మొబైల్‌లో ఫొటో తీసుకున్నాడని, ఆ ప్రశ్న పత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టిందని వివరించాడు.
తన కుమారుడిని బెదిరిస్తే.. భయపడి ప్రశ్నపత్రం ఇచ్చాడని, ఎలాంటి తప్పు చేయలేదని పిటిషన్‌లో వివరించారు.
పదో తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతించి, తన కుమారుడి భవిష్యత్తును కాపాడాలని కోర్టును అభ్యర్థించారు.
పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు .. హరీశ్ సోమవారం నుంచి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని విద్యాశాఖను ఆదేశించింది.